సిఎం రేవంత్‌కు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదు

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎకు 400 సీట్లు పక్కా
కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్‌ విలీనం ఖాయం
గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం
బిజెపి రాజ్యసభ ఎంపి డా. లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 14 : రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌ సర్కారుకు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదని బిజెపి రాజ్యసభ సభ్యులు డా. కే లక్ష్మణ్‌ హెచ్చరించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందన్న సీఎం రేవంత్‌ మాటలను ప్రజలు నమ్మలేదని చెప్పారు. హావ్నిలు అమలు చేయకపోతే ప్రజలు కాదు, కాంగ్రెస్‌ నేతలే తిరగబడుతారని తెలిపారు. ఇక ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఇక రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి హావ్నిలను, దేవళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు నమ్మలేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే, హావ్నిలు ఎలా అమలుచేస్తారని విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని, కారు పని అయిపోయిందని ఆయన విమర్శించారు. జాకీ పెట్టిన లేపినా కారు లేచే ప్రసక్తే లేదని చెప్పారు. భవిష్యత్‌ అంత బీజేపీదేనని ప్రజలంతా బీజేపీవైపే చూస్తున్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ వ్నిడియా సమావేశంలో మాట్లాడుతూ…దేశంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకే వొస్తాయని తెలిపారు. నాలుగు విడతల్లోనే బీజేపీ మెజారిటీ సాధించిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతి పక్ష హోదా కూడా దక్కుతుందో లేదో చూడాలని కే. లక్ష్మణ్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డిని ప్రజలు నమ్మండం లేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. కేవలం వోట్ల కోసం అడ్డగోలు హావ్నిలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని లక్ష్మణ్‌ తెలిపారు. హావ్నిల అమలుకు ప్రతి ఏటా రూ. 2 లక్షల కోట్లు కావాలని వివరించారు. సీఎం రేవంత్‌ సైతం కేసీఆర్‌ బాటలోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలోకి తీసుకెళ్తుందని ఘాటుగా స్పందించారు. ధరణి సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. గ్యారేజ్‌ నుంచి కారు బయటకు వొచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కడమే గగనమని తెలిపారు. కాంగ్రెస్‌లో, బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయమన్నారు. రెండు పార్టీలు బీజేపీ గెలుపును ఆపేందుకు యత్నించాయని ఆరోపించారు. కానీ తెలంగాణ ప్రజలు మోదీ నామస్మరణ చేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *