సిఎం రాజీనామా లేఖతో రావాలి

  • బాండ్లకు కాలం చెల్లిందని దేవుడిపై వోట్లు  
  • నాకు ఎంఎల్‌ఏ పదవి కంటే ప్రజలకు మేలు జరుగడమే ముఖ్యం
  • గన్‌పార్క్‌ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్‌రావు
  • సవాల్‌కు అనుగుణంగా రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ వద్దకు…

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : కాంగ్రెస్‌ పార్టీ హావ్నిలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు మండిపడ్డారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రైతు రుణ మాఫీపై సిఎం రేవంత్‌ రెడ్డితో చేసిన సవాల్‌కు అనుగుణంగా శుక్రవారం హరీష్‌ రావు రాజీనామా పత్రంతో హైదరాబాద్‌ కోకాపేటలోని తన నివాసం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్నిడియాతో మాట్లాడుతూ..బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్‌ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్‌ అని విమర్శించారు. తాను రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వస్తున్నాని, సీఎం రేవంత్‌ రెడ్డి కూడా వచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఆరు హావ్నిలు అమలు చేయాలన్నారు. అలాచేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో గన్‌పార్క్‌కు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే గన్‌పార్క్‌ వద్ద ఎక్కువ మంది గుమికూడ వద్దంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు పంపివేసారు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. గన్‌పార్క్‌కు వద్దకు తమను అనుమతించకపోవడంతో అసెంబ్లీ వద్ద ఆందోళన చేసేందుకు బీఆర్‌ఎస కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో అక్కడి నుంచి కూడా వారిని బలవంతంగా పంపించి వేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వొచ్చానని ఈ సందర్భంగా హరీష్‌ రావు అన్నారు.

దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హావ్నిలు నిజమైతే గన్‌పార్క్‌ వద్దకు ముఖ్యమంత్రి రావాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో ఆయన హరీశ్‌ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్దకు వొచ్చారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్నారు. హావ్నిలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని చెప్పారు. అమలు చేయకపోతే రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు. రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లేనని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హావ్నిలను అమలు చేయించడమే తమ కర్తవ్యమని వెల్లడిరచారు. ఆరు గ్యారంటీలపై తొలి సంతకం పెడతామని మోసగించారని చెప్పారు. ప్రజలను మోసం చేసినందుకుగాను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *