• తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారు…
• హబ్సిగూడ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: వందేళ్ల ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్ విశ్వ నగరంగా అవతరించి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని ఉప్పల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. వెనుకబడ్డ రాష్ట్రాన్ని పది ఏళ్లలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం అంటే మాటలు కాదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించినది సి ఎం కెసిఆర్ అని అన్నారు. బుధవారం హబ్సిగూడ డివిజన్ వెంకట్ రెడ్డి నగర్ లో బి ఆర్ ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరై జెండా ఆవిష్కరించి అక్కడినుండి ర్యాలీగా వెళ్తూ డివిజన్ నాయకులు, కార్యకర్తలు,పార్టీ శ్రేణులు ,మహిళలు బతుకమ్మ ఆట పాటలతో డప్పు వాయిద్యాలతో డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామంతపూర్ యాదవ్ సంఘం లో ఏర్పాటు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథిలుగా ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరైనారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రానున్న తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు దీమ వ్యక్తం చేశారు.ఏ చిన్న జబ్బు చేసిన వైద్యం చేసుకోవాలంటే వేల రూపాయలు ఉండాల్సిందే. ఉప్పల్ నియోజకవర్గం లోని ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను అందిస్తున్నాను అని ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తెలిపారు.పార్టీ నాయకులు కార్యకర్తలకే కాదు. ఎవరికి ఆపద వచ్చినా ముందుకు వచ్చి అనేక ఆసుపత్రిలో వైద్యం అందేలా కావలసిన సౌకర్యాలను అందేలా చేస్తున్నానని తెలిపారు .ప్రత్యేకంగా బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు మందులు కళ్లద్దాల ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు.ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఢిల్లీ బానిసలను, బానిసత్వం పార్టీలను అంగీకరించారు.ఎన్నికలు వస్తే ప్రజలు ఆగం కావద్దని తెలిపారు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. వందేళ్ల ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్ విశ్వ నగరంగా అవతరించి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని తెలిపారు.
వెనుకబడ్డ రాష్ట్రాన్ని పది ఏళ్లలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం అంటే మాటలు కాదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కెసిఆర్ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ పది యెండ్లలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి చూస్తే గత పాలకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోక తప్పదనే చెప్పుకోవాలి అని తెలిపారు. అన్ని అన్ని వర్గాలకు చేరువయ్యేలా, వారి అవసరాలను తీర్చేలా పథకాలను ప్రవేశపెట్టడమే కాదు వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ కే సి ఆర్ ముందుకు వెళ్తున్నారని అని ధీమా వ్యక్తం చేశారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే టీ హబ్ లతో పాటే రాష్ట్రంలో నిరుపేదలకు 5 రూపాయలకే కడుపునిండా అన్నం పెట్టేలా క్యాంటీన్లను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించడం లాంటి పథకాలతో దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఒక ఐకాన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడంలో కెసిఆర్ విజయవంతం అయ్యారని తెలిపారు.తెలంగాణ బలం బలగం అంతా హైదరాబాదే రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేదనీ, అందుకే కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. మెట్రో పూర్తి చేయడం, ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధితో పాటు లో కొత్తగా ఫ్లై ఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం, ఐటి రంగాన్ని విస్తరించేలా కొత్త క్లస్టర్ల నిర్మాణం అభివృద్ధిలో హైదరాబాదును సి ఎం కేసీఆర్ ఒక కొత్త శాఖానికి తీసుకు వెళ్లారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎం బీ సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బి ఆర్ ఎస్ సీనియర్ లీడర్ గంధం నాగేశ్వరరావు, హబ్సిగూడ డివిజన్ ప్రెసిడెంట్ డా,,బి వి. చారి, జనరల్ సెక్రెటరీ సోమిరెడ్డి మహిళా అధ్యక్షురాలు యాదమ్మ మైనారిటీ ప్రెసిడెంట్ అబ్ బాబా మాజీ కౌన్సిలర్ యాదగిరి, సల్ల వీరారెడ్డి, ఉపేందర్, లక్ష్మీనారాయణ, యూనివర్సిటీ లీడర్ మనోహర్, నరేందర్ నాయక్, బుచ్చిరెడ్డి, బిలకంటి చిన్న , యకంత్ ,హరీష్, అరవింద్, కిషోర్ , డివిజన్ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





