సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన సర్పంచ్ గొరిగే కలమ్మ రాజు

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 20 : మండల పరిధిలోని ఆకుల మైలారం గ్రామానికి చెందిన చింతల మంజులకి గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగినది పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్  సహకారంతో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలవడం జరిగిందని మంత్రి  చొరవతో  సీఎంరిలీఫ్ ఫండ్ కింద 25000 రూపాయలు చెక్కు మంజూరు అయిందని బుధవారం ఇట్టి చెక్కు ఆకుల మైలారం సర్పంచ్ గొరిగే కలమ్మ రాజు,మాజీ ఎంపీటీసీ దేవరశెట్టి రజిత నందీశ్వర్ల  చేతుల మీదుగా అందజేయడం జరిగిందని కలమ్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవరశెట్టి నందీశ్వర్,ఉప సర్పంచ్ ఎడ్ల రామ్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శంకరి తిరుపతయ్య,వార్డు సభ్యులు అచ్చన మల్లయ్య,ఎడ్ల అమరేందర్ రెడ్డి,తులవ మహేందర్,బండారి సువర్ణ బీరప్ప,మాజీ ఉపసర్పంచ్ పొన్న అంజయ్య,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు అచ్చన మల్లేష్,సీనియర్  నాయకులు పోల్కంపల్లి చంద్రయ్య,సుర ప్రభాకర్,లాడే శ్రీశైలం,గండు సురేష్,తల్లోజు వెంకటాచలం,శంకరి చిన్న జంగయ్య,గొరిగే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *