అక్షర యోధుడు
అభినవ వ్యాసుడు
అజ్ఞాత పోరాట ధీరుడు
అభ్యుదయ కవి పుంగవుడు
ఆయనే దాశరథి రంగాచార్య
ఇరవయ్యో శతాబ్ది సర్వత్రం
సాహితీ సీమను ఏలినవాడు
నిజాం నిరంకుశ పాలనపై
ధిక్కార స్వరం ఎత్తినవాడు
వెట్టి చాకిరి విముక్తి కోసం
సాయుధ పోరు చేసినవాడు
తెలంగాణ బతుకు చిత్రం
అక్షర శిల్పంగా చెక్కినవాడు
దోపిడి పెత్తందార్ల గుండెల్లో
కవన కత్తులు దూసినవాడు
ఉద్యమాలతోనే సాహిత్యం
జనిస్తుందని చాటినవాడు
వేదాలను తెలుగు భాషలో
పునరుక్తిగా మలిచినవాడు
తెలుగు భాషా నుడికారాన్ని
మేటి రచనా వ్యాసాంగంతో
తేటగా అవిష్కరించినవాడు
కవి, విమర్శకులు,నాటకకర్త
వక్త, సంస్కర్త సాహితివేత్తగా
పలు రంగాల్లో మెరిసినవాడు
సబ్బండ వర్గాల ఉన్నతికి
జీవితాన్ని అర్పించినవాడు
తెలుగు సాహితీ ప్రభాత
భావితర స్ఫూర్తి ప్రదాత
దాశరథి రంగాచార్యజీకి
తెలంగాణ జన జోహార్లు
(జూన్ 8 న దాశరధి రంగాచార్య వర్దంతి సందర్భంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493




