కర్రసాయం తీసుకుంది గొడ్డలి
అడవి నరకేయడానికి!
ఆడసాయం తీసుకున్నాడు మృగాడు
ఆమెను లొంగబరుచుకోడానికి!
వేరు సాయం పుచ్చుకుంది పురుగు
మహావృక్షం కూల్చడానికి!
బీగము సాయం తీసుకుంది తాళంకప్ప
ఇంటిని దోచెయ్యడానికి!
సన్నిహితుడి సాయాన్ని పొందారు
వైరిపక్షం విజయం సాధించడానికి!
అవయవం సాయం పొందింది రోగం
దేహానికి మరణశాసనం రాయటానికి!
వామొహాన్ని సాయం తీసుకుంది కల
మనసును కన్నీరుపెట్టించటానికి!
నాలిక సాయం తీసుకుంటుంది మాట
నోటితో వైషమ్యాన్ని కక్కడానికి!
అలల సాయం తీసుకుంది గాలి
కడలిని అల్లకల్లోలం చేయడానికి!
ఆసాంతం పరిశీలనలో
అవగతం ఏమయ్యిందంటే
శత్రువులు ఎవ్వరో
ఎక్కడనో లేరు?
అంతా మనలోనే ఉన్నారని!
అంతా తనవారై ఉంటారని!
– ఉషారం, 9553875577




