సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది.
హైదరాబాదు, ఆగస్ట్ 09 : సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ప్రధాన నదులు. ఈ రెండు నదులలో కలిపి తెలంగాణ రాష్ట్రానికి 1266.94 టీఎంసిల ( గోదావరి నదిలో 967.94 టీఎఎమ్‌లు, కృష్ణా నదిలో 299 టీఎఎమ్‌సీ) నీటి లభ్యత ఉంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ నీటి కేటాయింపులు సక్రమంగా వినియోగించకపోవడంతో తెలంగాణ ప్రాంత రైతులు తీరని కష్టాలు పడ్డారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రానికి కేటాయించిన నీటి వినియోగించుకొని 125 ఎకరాలకు సాగునీరు అందించేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రాజెక్ట్ ల రీడిజైనింగ్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో నీటి పారుదల రంగం అభివృద్దితో ఆయకట్టు 119 శాతం పెరిగింది.
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మేరకు తెలంగాణ సాగు నీటి రంగంలో దూసుకెళ్ళుతోంది. అందులో భాగంగా నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీ రాం సాగర్ ప్రాజెక్టుల వంటి పాత ప్రాజెక్టులను దశలవారీగా ఆధునీకరించడం జరిగింది. మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, వాటర్ బాడీల పునరుద్ధరించటం చేశారు. పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాజెక్టులను చేపట్టడం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసింది.
2014 కు ముందు భారీ, మధ్య తరహ ప్రాజెక్టుల పై చేసిన వ్యయం రూ.38,405.12 కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 1,55,210.86 కోట్ల రూ. లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఫలితంగా నీటి పారుదల విస్తీర్ణం 5.71 లక్షల ఎకరాల నుండి 17.23 లక్షల ఎకరాలుకు పెరిగింది. భారీ ప్రాజెక్టులైన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాలు కొత్తవి ం18.82 లక్షల ఎకరాలు స్థిరీకరణ, మొత్తం 37.07 లక్షల ఎకరాలు, జె.జె.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 5.58 లక్షల ఎకరాలు, రాజోలిబండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 2.03 లక్షల ఎకరాలు, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 4.24 లక్షల ఎకరాలు, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 2 లక్షల ఎకరాలు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 12.30 లక్షల ఎకరాలు, శ్రీ రాం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 3.28 లక్షల ఎకరాలు కొత్తవిం3.45 లక్షల ఎకరాలు స్థిరీకరణ, మొత్తం 6.73 లక్షల ఎకరాలు 1.16 లక్షల ఎకరాలు ఎల్లందులో అదనపు ఆయకట్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 3.61 లక్షల ఎకరాలు పనులు పురోగతిలో ఉన్నాయి.




