సాంప్రదాయ రీతిలో శ్రీనివాస మంగాపురం వెంకన్న బ్రహ్మోత్సవాలు

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28న సాయంత్రం అంకురార్పణ జరిగి, 29 నుండి మార్చి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిని నారాయణవనంలో పరిణయం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతుడై తిరుమల కొండకు బయలుదేరగా.. శాస్త్ర ప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలల వరకు కొండ ఎక్కకూడదని పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదని అగస్త్య మహర్షి చెప్పారట. దీంతో స్వామివారు దేవేరితో కలిసి అగస్త్య ఆశ్రమంలోనే 6నెలలపాటు విడిది చేశారట. ఆరునెలల తర్వాత తిరుమల కొండకు పయనమైన స్వామివారు భక్తులకు రెండు వరాలను ప్రసరించారని పురాణాల కథనం.

ఇక్కడ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో ఉన్న దాని కంటే పెద్దది. తిరుమలలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాలా దగ్గర దారి. తిరుపతి అలిపిరి నుండే ఉండే మెట్ల దారి కంటే ఇది చాలా దగ్గర. సుమారు గంట లోపలే తిరుమల కొండ పైకి వెళ్లవచ్చు. కొవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు నిర్వహించలేదు. ఈసారి పరిస్థితులు అంతా సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహించ నున్నారు. తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరిం చారు. వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 28వ తేదీ బుధ సాయంత్రం సేనాపతి ఉత్సవం అంకురార్పణ జరిగి, ఫిబ్రవరి 29వ తేదీ ఉదయం 8.40 నుంచి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ మవుతాయి. 1న ఉదయం చిన శేష వాహనం, సాయంత్రం హంస వాహనంబీ 2న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనంబీ 3న కల్ప వృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 4న పల్లకీలో మోహినీ అవతారోత్సవం, సాయంత్రం గరుడ వాహనంబీ 5న హనుమద్‌ వాహనం, సాలకట్ల వసంతోత్సవం, సాయంత్రం గజ వాహనంబీ 6న ఉదయం సూర్య ప్రభ వాహనం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనంబీ 7న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహనంబీ 8న ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, అవభృతం, చక్ర స్నానం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవం,  ధ్వజావరోహణం నిర్వహించ నున్నారు.  ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *