పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: గ్రామాల్లో జరుపుకునే బోనాల ఊరేగింపు ప్రజలందరిని సుఖ సంతోషాలతో చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కోరారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపుర్ మున్సిపాలిటీ పరిధి కొమరంభీమ్ ఇంద్రనగర్ కాలనీలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల జాతరలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో తీసిన పలారం బండి కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన నీలం మధు, అమ్మవారి అండదండతో ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని ఆయన కోరారు.జాతర మహోత్సవాలతో ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంటుందని తెలిపారు. ఊరూరా బోనాల మహోత్సవాలు సందడిగా మారాయన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఉత్సవ నిర్వాహకులు నీలం మధు కు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాండు, నర్సింహ,శ్రీనివాస్,శ్రీశైలం,కొండయ్య, బిక్షపతి,రమేష్ బాబు,శ్రీనాథ్, ప్రభాకర్ యాదవ్,వెంకటయ్య, ప్రవీణ్,ఎం శ్రీనివాస్,అశోక్, ధరణి రాజు,రాజేష్,జగన్, బోయిని సాయి,సంతోష్, అశ్విన్,కాలనీ వాసులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




