సహస్రాబ్దుల అస్తిత్వం.. తెలంగాణకు సొంతం…

‘‘‌నిజాం పాలనలో ఉత్తరాది వారికి ఉద్యోగాలలో పెద్ద పీట వేసిన నేపథ్యంలో, స్థానికులకు ఉపాధి ఆకాశాలు దక్కాలని 1910 – 1918 మధ్యకాలంలో ప్రజలు ఉద్యమించడంతో, మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1919‌లో ముల్కీ నిబంధనలు ప్రవేశ పెట్టారు.1956లో ఆంధ్ర, హైదరాబాద్‌ ‌ప్రాంతాలు విలీనమయ్యాక, వలసలు మరింత అధికమైనాయి. స్వార్థ రాజకీయాల ఫలితంగా, ముల్కీ నిబంధనలు అమలు కాని స్థితిలో, 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. 1969 జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు…. ఖమ్మం జిల్లా పాల్వంచలోని ధర్మల్‌ ‌స్టేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులలో అధికులు ఆంధ్రా వారు కావడంతో నిరసనలకు దిగారు. ‘‘తెలంగాణ రక్షణ సమితి’’ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. ఉద్యమం లోనికి ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థులు ప్రవేశించారు. జనవరి 13న ఉస్మానియాలో ‘‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’’ రూపుదాల్చింది.’’

– రామ కిష్టయ్య సంగనభట్ల, 9440595494

పాత రాతి యుగం నుండి ఉనికిని కలిగి, పూర్వ రాతి యుగపు ఆవాసాలకు నిలయమై, షోడశ మహా జన పథాలలో, దక్షిణ ప్రాంత ఏకైక ఆశ్మక జన పథాన్ని అంతర్భాగంగా కలిగి, అఖండ భారతావనిలో, ప్రత్యేక స్థానం పొందింది తెలంగాణ ప్రాంతం.
రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. బుద్ధుని కాలాన బోధన్‌ ‌ప్రాంత పాలకునిగా సుజాతుడు ఉన్నట్లు, బుద్ధుని సమకాలికుడైన బావరి, బాదన కుర్తిలో స్థిరపడినట్లు, మత్స్య పురాణ ఆధారంలో మంజీరా నది ప్రస్తావన, పైఠాన్‌ ‌రాజధానిగా, ఉత్తర…. దక్షిణాలకు ప్రధాన మార్గాన్ని కలిగిన ‘‘ములక’’ రాజ్యం గోదావరి నది హద్దు వరకూ విస్తరించినట్లు, మగధ సామ్రాజ్యం బల పడ్డాక, ఆశ్మక సైతం, మగధలో, విలీనమైనట్లు చరిత్రకారులు నిరూపించారు. నందుల కాలానంతరం, మౌర్యుల హయాంలో పర్యటించిన, చైనా యాత్రికుడు మెగస్తనీసు పేర్కొన్న, 30 బలిష్ట దుర్గాలలో కదంబాపూర్‌, ‌బోధన్‌, ‌పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్‌, ‌ఫణిగిరి, కొండాపూర్‌, ‌శాతవాహన చక్రవర్తుల తొలి రాజధాని కోటిలింగాల, చోటుచేసుకోవడాన్ని బట్టి ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజ్యం లేకపోగా, ఇక్ష్వాకుల పాలనలో తూర్పు ప్రాంతాలు విజయపురి రాజధానిగా, వాకాటుల ప్రారంభ కాలంలో ఉత్తర తెలంగాణ ఉండగా, ప్రవర సేనుడి కాలాన  తెలంగాణ మొత్తం రాజన్యుల ఏలు బడికి రాగా, తరువాతి  ‘‘విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయే’’ అని ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు బి. ఎన్‌. ‌శాస్త్రి నిరూపించారు. బాదామి చాళుక్యుల పాలనలో తెలంగాణ మొత్తం ఉండగా, రాష్ట్రకూట, బాదామి చాళుక్య, చోళ, కాకతీయ, కుతుబ్‌ ‌షాహీల ఏలు  బడులలో, ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి, తన ఉనికి చాటుకుంది ఈ నేల. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛా వాయువులను పీల్చ లేకపోయింది. 1948 సెప్టెంబర్‌ 17‌న పోలీసు చర్య ఫలితంగా, తెలంగాణ  విమోచనోద్యమానికి ముగింపుగా భారతావనిలో అంతర్భాగమైంది. 1724 –  1948  మధ్యకాలంలో 224 ఏళ్ల పాటు, ఎనిమిది తెలంగాణ జిల్లాలు, ఐదు మరట్వాడా జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలతో కలిపి 16 జిల్లాల హైదరాబాద్‌ ‌రాష్ట్రం, మూడు భాషలలో కొనసాగింది. 1948 సెప్టెంబర్‌ 13‌న పోలీసు చర్య నేపథ్య ఫలితంగా మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌లొంగి పోవడంతో, హైదరాబాద్‌ ‌రాష్ట్రం భారత ప్రభుత్వ పాలనలో విలీనమైంది. వరంగల్‌ ‌నుండి కొంత ప్రాంతం, గోదావరి జిల్లాల నుండి భద్రాచలం, దండకారణ్య ప్రాంతం వేరు చేస్తూ ఖమ్మం జిల్లాను రూపొందించారు. 1948 నుండి 1952 వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వం లేని కారణాన, మిలిటరీ సివిల్‌ అధికారుల పాలనలో, ఇంగ్లీష్‌ ‌భాష రాదన్న సాకుతో, మదరాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతం నుండి, ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి, అధిక సంఖ్యాకులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది.

image.png
నిజాం పాలనలో ఉత్తరాది వారికి ఉద్యోగాలలో పెద్ద పీట వేసిన నేపథ్యంలో, స్థానికులకు ఉపాధి ఆకాశాలు దక్కాలని 1910 – 1918 మధ్యకాలంలో ప్రజలు ఉద్యమించడంతో, మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1919‌లో ముల్కీ నిబంధనలు ప్రవేశ పెట్టారు.1956లో ఆంధ్ర, హైదరాబాద్‌ ‌ప్రాంతాలు విలీనమయ్యాక, వలసలు మరింత అధికమైనాయి. స్వార్థ రాజకీయాల ఫలితంగా, ముల్కీ నిబంధనలు అమలు కాని స్థితిలో, 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. 1969 జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు…. ఖమ్మం జిల్లా పాల్వంచలోని ధర్మల్‌ ‌స్టేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులలో అధికులు ఆంధ్రా వారు కావడంతో నిరసనలకు దిగారు. ‘‘తెలంగాణ రక్షణ సమితి’’ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. ఉద్యమం లోనికి ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థులు ప్రవేశించారు. జనవరి 13న ఉస్మానియాలో ‘‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’’ రూపుదాల్చింది.  మెడికల్‌ ‌విద్యార్థి మల్లికార్జున్‌ ‌ను నాయకునిగా ఎన్నుకున్నారు. జనవరి 20న తొలిసారి విద్యార్థులపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘‘జస్టిస్‌  ‌భార్గవ కమిటీ’’ని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణల అమలుకు జీవో జారీ అయింది. ఫిబ్రవరి 28 లోగా నాన్‌ ‌ముల్కీ ఉద్యోగులను తిరిగి పంపుతామని, జీవో ను నిర్లక్ష్యం చేసే అధికారులపై, కొరడా ఝళిపిస్తామని, ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24న సదాశివపేటలో జరిగిన కాల్పులలో 14 మంది మరణించారు. గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన 17ఏళ్ల శంకర్‌ ‌తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనాడు. కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ రాజీనామా చేశారు. జూన్‌ 4‌న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్‌ ‌వచ్చి, విద్యార్థి,  ప్రజాసమితి నేతలతో చర్చలు జరిపారు. ఉద్యమంలో 369 మంది అసువులు బాసినా, మృతుల సంఖ్య 57 అని అధికారులు పేర్కొన్నారు. ప్రజాబలం అండగా, విద్యార్థుల ఉద్యమాల ఫలితంగా, 1971లో 12 లోక్‌ ‌సభ సీట్లలో పదకొండింటికి సాధించిన తెలంగాణ ప్రజా సమితి (టి పి ఎస్‌) ఇం‌దిరా గాంధీతో చర్చల అనంతరం కాంగ్రెస్‌ ‌లో విలీనమైంది. 1979 లో హైదరాబాద్‌ ‌నుండి రంగారెడ్డి జిల్లా ఆవిర్భావం జరిగింది.
image.png
తరువాత కేసిఆర్‌ 2001 ఏ‌ప్రిల్‌ 21 ‌నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్‌ ‌పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్‌ 27‌న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు’’. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ ‌ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ని ప్రభావితం చేశాయి.
2001లో కొత్తగా ఉత్తరాఖండ్‌, ‌జార?ండ్‌, ‌ఛత్తీస్గఢ్‌ ‌రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది.
మలి దశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌ ‌తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది. తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న కరీంనగర్‌ ‌లో ‘‘తెలంగాణ సింహగర్జన’’ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించారు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనతో ‘‘తెరాస’’, భూమికగా,  వివిధ వర్గాల సహకారంతో ఉద్యమాన్ని నడిపారు. తెలంగాణకు జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ వాసులకు వివరించి, చైతన్యవంతులను చేసే ఈ కార్యక్రమంలో క్రమానుగతంగా సఫలీకృతులయ్యారు.
2009 నవంబరు 29న కేసీఆర్‌ ‌తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. చేపట్టడానికి కరీంనగర్‌ ‌నుండి సిద్ధిపేట దీక్షాస్థలికి బయలు దేరుతుండగా, మధ్యలో కరీంనగర్‌ ‌దగ్గరలోని అలుగునూరు వద్ద పొలీసులు అరెస్టుచేసి, ఖమ్మం పట్టణానికి తరలించారు. అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్‌ ‌జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్ని తరలించారు.
image.png
2009 డిసెంబర్‌ 9‌న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. 2010లో లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు 6 ప్రధాన సిఫార్సులు చేసింది. 2009 డిసెంబర్‌ 3‌న ప్రారంభమైన మలి  దశ ఉద్యమంలో, ఆత్మ త్యాగం చేసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి. కేసిఆర్‌ ‌కార్య దీక్షకు తోడుగా, 2011లో ఏర్పాటైన ‘‘రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి’’ (పొలిటికల్‌ ‌జేఏసీ) సహకారంతో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, కార్మికులు, కుల సంఘాల బాధ్యులు పోరాటంలో దూకారు. ఆత్మబలిదానాలు, సబ్బండ వర్ణాల ఆకాంక్షలు బహిర్గతమై, అధికార కాంగ్రెస్‌ ‌ప్రజా ప్రతినిధులు చేసిన ఆందోళనతో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
‘‘సకల జనుల సమ్మె’’, ‘‘మిలియన్‌ ‌మార్చ్’’ ఆం‌దోళనలు, ఉదృతం అయినాయి.
2013 జూలై 30న కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సోనియా గాంధీ మార్గ నిర్దేశంతో, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి,  2013 అక్టోబర్‌ 3‌న కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.
2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.
2014 జూన్‌ 2‌న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. కేసిఆర్‌ ‌నేతృత్వంలోని తెరాస తొలి, మలి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తున్నది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *