సల్లగా చూడు పోచమ్మ తల్లి

పరిగి రోడ్డు పోచమ్మ తల్లిదేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టిన కాంగ్రెస్ యువ నాయకులు*
మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ యువ నాయకులు మంగ మధు
షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: ఫరూక్నగర్ లోని 27వ వార్డు పరిగి రోడ్డులో కోరిన ముక్కులు తీర్చే తల్లి పోచమ్మ తల్లి అంటూ పోచమ్మ తల్లి  దేవాలయంలో కాంగ్రెస్ భక్తుల నినాదాలు మారు మ్రోగాయి. బుధవారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మంగ మధు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయా విభాగాల నాయకులు ఆలయ ఆవరణలో  కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ గెలుపుతో కార్యకర్తల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్ల వర్ధన్ రెడ్డి గారు. నల్లమోని శ్రీధర్. మురళీమోహన్ (అప్పి). గుండాల నరేందర్. లింగం. వినోద్. రాజు. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *