సర్కారు దవాఖానలో సకల సౌలత్‌లు ..

  • కాన్పులకి ప్రభుత్వ దవాఖానకే రావాలె
  • నాకు జరిగిన మేలు అందరికీ జరగాలి..
  • మీరు చెప్పినట్టే సాధారణ కాన్పు చేయించిన, బిడ్డ మనవడు మంచిగుండ్రు…
  • మంత్రి హరీష్‌రావుకు ఉత్తరం రాసిన సిరిసిల్ల వాసి శామంతుల వసంత
  • నూరు వసంతాలు వసంత వర్ధిల్లాలి : సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 : రాజన్న-సిరిసిల్ల జిల్లా చింతల్‌ ‌ఠాణా ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌కాలనీకి చెందిన పోచయ్య బిడ్డ పురిటి నొప్పులతో బాధపడుతుంటే  సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానలో డెలివరీకి తీసుకెళ్లాడు. వైద్యులకు చూపించారు. వారు ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం అనడంతో.. మంత్రి హరీష్‌రావు సర్‌ ‌టీవీల్లో చెప్పిన మాట విని సాధారణ కాన్పుకు సిద్ధమయ్యాడు. ఓపిక పట్టి సాధారణ కాన్పు చేపించాడు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంతోషంలో మంత్రి హరీష్‌రావుకు పోచయ్య, అదే విధంగా తన బిడ్డ వసంత  పోస్ట్ ‌కార్డు ద్వారా ఉత్తరం వ్రాసి పంపారు. ‘సారు..

మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్‌ ‌సర్‌ ‌వల్ల మంచిగ వసతులు ఉన్నాయనీ, సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుక పోయిన మా కేటీఆర్‌ ‌సారు కూడా దవాఖాను బాగా చేసాడు అని ఉత్తరంలో వ్రాసారు. అదే విధంగా బాగా నొప్పులతో దవాఖానకు  వెళ్లినం. అక్కడ డాక్టర్లు మంచిగ చూసి ఓపిక పట్టు సాధారణ కాన్పు చేపించుకోమన్నారు. మీరు( హరీష్‌రావు) టీవీల్లో చెపుతారు కదా సాధారణ కాన్పులు గురించి అని అలానే చేపించినటు ఆ ఉత్తరంలో వ్రాసారు. ప్రభుత్వ దవాఖానలో కాన్పు వల్ల పైసా ఖర్చు లేదు.

పైగా కేసీఆర్‌ ‌కిట్‌ ఇచ్చిండ్రు. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనంలో ఇంట్లో దించిండ్రు..కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నాకు బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికి తెలవాలన్న ఉద్దేశ్యంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నాను…సార్‌ అం‌టూ..‘ సర్కారు దవాఖానలో సకల సౌలత్‌లు ఉన్నయ్‌..   ‌కాన్పులకి ప్రభుత్వ దవాఖానకే రావాలె..నాకు జరిగిన మేలు అందరికి జరగాలె’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఉత్తరం సాధారణ కాన్పులకు చైతన్యం…నూరు వసంతాలు వసంత వర్ధిల్లాలి : సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు
సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేపించుకొని ప్రభుత్వ దవాఖాన సేవలను, అదేవిధంగా సాధారణ కాన్పులు చేపించుకోవాలని నీకు జరిగిన మేలు అందరికి జరగాలని ఉత్తరం ద్వారా ఒక మంచి ఉపదేశం చింతల్‌ ‌ఠాణా ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌కాలనీకి చెందిన వసంత ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉందనీ, వసంత నూరు వసంతాలు పిల్లా పాపాల తో వర్ధిల్లాలని మంత్రి హరీష్‌రావు కోరుకున్నారు. ఈ ఉత్తరం మహిళలో ప్రజల్లో గోప్ప చైతన్యం స్పూర్తిని ఇస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *