సముచిత స్థానాన్ని కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే సాధ్యమైంది

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి పదవులతో గౌరవించడం ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రభుత్వానికే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కుర్ర సత్యనారాయణ ని ఆయన నివాసంలో నీలం మధు ముదిరాజ్ కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీలో కష్టపడిన వారందరికీ  సముచిత స్థానాన్ని కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే సాధ్యమైందనీ నీలం మధు అన్నారు.బీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవను గుర్తించి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయటం మన ప్రాంతానికే గర్వకారణం మని అన్నారు. ఆయన సేవలు మనమందరం వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *