వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటన
లక్నో,సెప్టెంబర్29 : సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు..సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా నరేశ్ ఉత్తమ్ పటేల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. రానున్న ఐదేళ్ళలో ఎస్పీ జాతీయ పార్టీగా ఎదగడానికి కృషి చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. గత ఎన్నికల్లో ప్రజలు ••ఖకే ఓటు వేశారని.. అయినప్పటికీ తమ నుంచి ప్రభుత్వాన్ని బీజేపీ లాక్కుందని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి.. తప్పుడు మార్గాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు.
ఎన్నికల కమిషన్‌పై తమకు గౌరవముందని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఇఅఎ బీజేపీ బూత్ ఇన్‌ఛార్జిలకు కొమ్ముకాసిందని ఆరోపించారు. యూపీలో అధికారాన్ని కోల్పోతే…కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినట్లే అని భావించే…బీజేపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో..బూత్ స్థాయిలో పటిష్టంగా తయారవ్వాలని సూచించారు. జైళ్లకు వెళ్లా?ల్సి వచ్చినా.. తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయన్నారు. బీజేపీ ప్రభుత్వాలు వ్యవస్థలను కబ్జా చేశాయని చెప్పారు.


