సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. గురువారం బిజెపి జన సేన పోతులో భాగంగా తాండూరులో పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బిజెపి సహకారంతో తాండూరులో జనసేన విజయం ఖాయమని జనసేన  అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికార బలం, డబ్బు బలంతో  తిరిగి అధికారంలోకి రావాలని చూస్తుందని అన్నారు.  ఎన్నికల ఖర్చు మొత్తంగా రూ. 40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అయితే తాండూరులో బిఆర్ఎస్ పార్టీ ఒకేరోజు రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. బిజెపి సహకారంతో,  ప్రజల మద్దతుతో తప్పకుండా తాండూరులో విజయం సాధిస్తామని ఆయన అన్నారు.  బిజెపి-  జనసేనల ఉమ్మడి మేనిఫెస్టో త్వరలోనే విడుదల కానున్నట్లు చెప్పారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాండూర్  కు వచ్చి ప్రచారం చేస్తారని అన్నారు. ఎన్నికల్లో జనసేన గెలిస్తే తాండూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు, విద్య, వైద్య ఉపాధి, స్థానికులకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జనసేన నాయకులు రవీందర్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *