సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 31 : రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాన్ని దుర్భరం చేస్తున్న సిపిఎస్ భూతాన్ని అంతం చేయడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టామని, అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపి తమ సమస్యను పరిష్కరించాల్సిన కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని టపస్ రాష్ట్ర కార్యదర్శి సింగోజు జనార్దన్ అన్నారు. సోమవారం తపస్ జిల్లా అధ్యక్షుదు5 ఊడెం రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యమ జాగరణ కార్యాచరణలో భాగంగా సిద్దిపేట రెవిన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనార్ధన్ ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించారు. ఐదు సంవత్సరాలు ప్రజా ప్రతినిధులుగా ఉండే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు ఒక నీతి తమ జీవితకాలం మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపరిచే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంకో నీతి ప్రదర్శించడం ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే తమ ద్వంద నీతిని విడనాడి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. సిపిఎస్ అంతమే తమ మొదటి ప్రాధాన్యతగా భావించి తపస్ ఈ నెల 10న కలెక్టరేట్ల ముందు, 19న హైదరాబాద్ లో ధర్నా కార్యక్రమాలను నిర్వహించుతుందని, ఇందులో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘు వర్ధన్ రెడ్డి మురళీధర్ లు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా డు ఆర్ డై నినాదంతో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ప్రజల స్ఫూర్తితో క్విట్ సిపిఎస్ ఉద్యమంలో డు ఆర్ డై అంటూ ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొని సీపీఎస్ ను అంతం చేయాలని కోరారు. రెండవ వేతన సవరణ సంఘాన్ని నియమించి మద్యంతర భృతిని ప్రకటించాలని, బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర బాధ్యులు శ్రీనాకర్ రెడ్డి, నర్సిరెడ్డి, మహేందర్ రెడ్డి, శివకుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు వైవి శశికుమార్, శ్రీనివాసరెడ్డి,



