సమస్త మానవాళికి మీ ప్రవచనాలు అమృతంలాంటివి

• సిద్ధిపేటలో చాగంటి కోటేశ్వరరావుకు స్వాగతం పలికిన మంత్రి హరీష్‌రావు
• మీ ప్రగతిని విన్నాం-ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది
• మంత్రి హరీష్‌రావుతో చాగంటి
• అక్టోబర్‌ 2‌వరకు సిద్ధిపేటలో చాగంటి ప్రవచనాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30:  ‌సమస్త మానవాళికి మీ ప్రవచనాలు అమృతంలాంటివని, మానవీయ విలువలకు గొప్ప ప్రేరణ అని,అసమాన్య విషయాలను సైతం సామాన్యలకు అర్థమయ్యేలా మీ ప్రవచనాలు గొప్ప సందేశాన్ని ఇస్తామనీ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మజీ చాగంటి కోటేశ్వరరావును ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.  సిద్ధిపేటలో  ప్రవచనాలు చెప్పడం ఈ ప్రాంత  ప్రజలు చేసుకున్న గోప్ప అదృష్టమన్నారు. శనివారం నుండి మూడ్రోజుల పాటు సిద్ధిపేట  పట్టణంలో ‘మానవీయ  విలువలు’అనే అంశంపై  ప్రవచనాలు వినిపించడానికి శనివారం సాయంత్ర  వచ్చిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును రంగనాయక సాగర్‌ ‌వద్ద ఇరిగేషన్‌ ‌గెస్ట్‌హౌస్‌లో స్వాగతం పలికి, అహ్వనం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు కాసేపు చాగంటితో  ముచ్చటించారు.

మీరు సిద్దిపేటకు రావడం గొప్ప అదృష్టమని, ఈ ప్రాంతం చేసుకున్న పుణ్యమని, మీ ప్రవచనాలు గొప్ప ప్రేరణ ను కలిగిస్తాయని చెప్పారు.  మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనం చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ,  భక్త జన మనసులను దోచుకుంటున్నారన్నారన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు  మానవత్వం విలువలపై ప్రవచనాలు వినిపించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో సిద్దిపేట విద్య, వైద్యం మౌలిక వసతుల కల్పన, సాగునీరు, వ్యవసాయం, ఆధ్యాత్మిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, సిద్దిపేట ప్రజలు ఆధ్యాత్మిక భావనతో సత్ప్రవర్తన కలిగి ఉండి జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు.

గోదావరి నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాలేశ్వరం నిర్మించడం ద్వారా సీఎం కేసీఆర్‌  ‌తెలంగాణలో కరువుకు శాశ్వత సెలవుగా  చూపించారని, మూడు రోజులు సౌకర్యవంతంగా ఉండడానికి ఏర్పాట్లు చేశామని, కుటుంబ సభ్యులతో సిద్దిపేటలోని  కోమటిచెరువు పర్యాటక కేంద్రాన్ని వీక్షించాలని, సిద్దిపేట ప్రజలకు చక్కటి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించాలని మంత్రి చాగంటి కోటేశ్వరరావును కోరారు. రామాయణం, భాగవతం , సుందరకాండ ప్రవచనాలపై మీ ప్రవచనాలు ఎంతో చైతన్యంను ఇస్తాయని…సిద్దిపేటలో మానవీయ విలువలు అంశంపై మీరు చెప్పే ప్రవచనాలు గొప్ప ప్రేరణను కలిగిస్తుందని ఆశిస్తున్నామన్నానీ మంత్రి హరీష్‌రావు అన్నారు.

మీ ప్రగతిని విన్నాం-ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది
మంత్రి హరీష్‌రావుతో చాగంటి

సిద్ధిపేట ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. మీ ప్రగతి గురించి విన్నాం.  మిమ్మల్ని కలవాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానని చాంగటి  మంత్రి హరీష్‌రావుతో పంచుకున్నారు.  దేవుని దయవలన మీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వాలని అడిగిన వెంటనే ఈరోజు(శనివారం) సిద్ధిపేటకు రావడం జరిగిందని, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి అన్ని ప్రాంతాలలో జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ,  ఇలాంటి అభివృద్ధిని సాధించిన మీకు ప్రత్యేక అభినందనలు. మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయాన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *