పరీక్షలకు ప్లానింగ్ తప్పని సరి కటెన్సన్ వీడితేనే పరీక్షలు సులభం
ఫిబ్రవరి నుండే పరీక్షల భయం పట్టుకుంటుంది. పరీక్షలు వస్తున్నాయి అనగానే అటు విద్యార్థులలోను ఇటు తల్లిదండ్రులలోను మనసులో టెన్షన్ మొదలవుతుంది. పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్నసమయం. భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది.దీనితో పిల్లలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తే పరీక్షలలో విజయం సాధించడం చాలా సులభం. పరీక్ష అనగానే విద్యార్థుల ఆలోచనలు గుర్రాల వలే పరుగులు తీస్తుంటాయి. మంచి మార్కులు సాధించగలనా… తల్లిదండ్రులు నా పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చుగలుగుతానా… సరైనా సమాధానాలు రాయగలుగుతానా… ఆశించిన మార్కులు రాకపోతే పరిస్తితి ఏమిటి… బంధువులు, స్నేహితుల, ఉపాధ్యాయుల వద్ద పాఠశాలలో తోటి వారి వద్ద పరిస్తితి ఎలా ఉండబోతోంది… ఇలాంటి ఆందోళన వారి మెదళ్లలో మెదులుతుంటుంది.ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలు ప్రక్కన పెట్టి పరీక్ష రాయండి. విజయం మీ కాళ్ల దగ్గరకు వచ్చి నిలుచుంటుంది. పరీక్షల భయాన్ని తగ్గించుకోవడం విద్యార్థుల చేతిలోనే ఉంటుంది.
లక్ష్యం (గోల్): పరీక్షలకు ప్రిపేర్ అయ్యేకంటే ముందే లక్ష్యంను ఏర్పాటు చేసుకోవడం వల్ల చదవాలనే కోరిక బలంగా ఉంటుంది. నేను ఈ సబ్జెక్ట్ లో ఎన్ని చాప్టర్ లు పూర్తిచేస్తామో అని ముందే అనుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టడం వలన చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్ లోని చాప్టర్లు పూర్తిచేయాలనే పట్టుదల పెరుగుతుంది. లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉంటే అనుకున్న టార్గెట్ ను పూర్తి చేయగలుగుతాం. ప్రణాళిక (ప్లానింగ్): విద్యార్థులు ఖచ్చితంగా ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఏ రోజు ఏం చదవాలి ఎంతమేరకు చదవాలి అని నిర్దేశించుకోవాలి. విద్యాసంవత్సరం మొదటినుండి బాగా చదివే వాల్లు కొందరైతే మరి కొంతమంది పరీక్షలు మొదలయ్యే సమయానికి చదవడం ప్రారంభిస్తారు. దీనితో టెన్సన్ మొదలవుతుంది. కాబట్టి ముందుగానే ప్రణాళిక ఉంటే పరీక్ష సమయానికి ఉల్లాసంగా ఉండవచ్చు. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ చాప్టర్ లు పూర్తిచేయాలి అని ప్లాన్ చేసుకుని చదవాలి. ప్లానింగ్ ను ఒక పేపర్ పైన రాసుకుని చదివే రూంలో మనకు కనపడే విధంగా గోడకు అంటించుకోవాలి. సమయపాలన (టైం మేనేజ్ మెంట్): మనకు రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగ పరుచుకోవాలి. ఏ సమయానికి ఏది పూర్తిచేయాలో ఆ సమయానికి అది పూర్తి చేసుకోవాలి. అలాగని రాత్రంతా మేలుకొని చదవడం వల్ల ప్రయోజనం కనిపించదు. ఉదయం 4.30 నుండి 6 గంటల సమయంలో మన మెదడు చాలా చురుకుగా పని చేసే అవకాశం ఎక్కువ.
ఆత్మ విశ్వాసం (సెల్ఫ్ కాన్పిడెన్స్): పరీక్షల్లో మీ సిలబస్ లో ఉన్నవాటి నుండి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ఏ ప్రశ్నలు వస్తాయో అని భయపడుతూ వెళితే మీరు చదివింది కూడా గుర్తుకు రాకుండా పోతుంది. పరీక్షకు వెళ్లేటప్పుడు ఆత్మ విశ్వాసంతో వెళ్లాలి.
పరీక్షల భయం (ఎగ్జామ్ ఫియర్): భయాలు ఎవరికీ పుట్టుకతో రావు. పరిస్థితులను మనకు మనంగా సృష్టించుకొని భయపడటం అలవాటుగా చేసుకున్నాం అని గుర్తించుకోవాలి. కాబట్టి మానసికంగా దృడంగా ఉండాలి. సిలబస్ రివైజ్ చేసుకుంటూ పాత కొశ్వన్ పేపర్లు ఏమైనా ఉంటే తరచూ వాటికి సమాధానాలు రాస్తూ ఉండాలి. దీనివల్ల ‘‘పరీక్ష ఎప్పుడు వచ్చినా నేను సిద్ధం’’ అనే భావన మీలో తప్పకుండా కలుగుతుంది. చాలామంది చదువుతారు కానీ రాయడం అలవాటు చేసుకోకపోవడం వల్ల పరీక్షల్లో వేగంగా రాయడానికి ఇబ్బంది పడతారు. ఇంకొంత మంది బాగా చదివే ఇతరులతో పోల్చుకుని కృంగిపోతారు. అలా కృంగిపోకుండా ‘‘అందరూ పుట్టుకతో మేధావులు కారు’’ అనే విషయాన్ని మననం చేసుకుని చదవాలి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, అసూయపడరాదు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. మనలో ఉన్న నైపుణ్యాలను మనకు మనముగా ఎల్లప్పుడూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మనలో లేని నైపుణ్యాలను ఇతరులలో గమనించినపుడూ అసూయ పడకుండా మన మనసుకు తగు సూచనలను జారీ చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తి ఒక . ప్రత్యేకం. ఇతరులతో పోల్చుకోవడం అనేది దరిదాపులకు రానీయకూడదు. మనలో ఉన్న సామార్ధ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వసాన్ని దృఢపరచుకోవాలి.
ఆరోగ్యకరమైన నిద్ర: విద్యార్థులు పరీక్ష రేపు ఉందనగా రాత్రంతా మెలకువతో ఉండి మరీ చదవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఒత్తిడికి గురవుతారు. నిద్రకు ఖచ్చితంగా 6 గంటల సమయాన్ని కేటాయించండి.
అనవసర భయాలు వీడాలి: విద్యార్థులు పరీక్ష మొదలయ్యే సమయానికి కూడా పరీక్షా కేంద్రానికి చేరలేక ఒత్తిడికి లోనవుతారు. పరీక్షా సమయానికి కంటే 45 నిమిషాలు ముందుగానే చేరుకోవడం వల్ల రిలాక్స్ ఉంటుంది. పరీక్షా హాలులో అడుగు పెట్టగానే ‘‘ఏ ప్రశ్నలు వస్తాయో, నేను చదివినవి వస్తాయో లేదో’’ అనే అనవసరమైన భయాలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి వల్ల కష్టపడి చదివినదంతా మరిచిపోయే ప్రమాదం ఉంది. అనవసర భయాలు దరి చేరనివ్వకండి.
స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్
సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
9703935321





