హుస్నాబాద్ పట్టణ సమీపంలో కరీంనగర్ రోడ్డులో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన గత రెండు రోజులుగా జరుగుతున్న సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శుక్రవారం పర్యవేక్షించారు. మైదానం చదును పనులు, వేదిక నిర్మాణం పనులు, అలాగే హెలిప్యాడ్ నిర్మాణం పనులు పరిశీలించారు. వాహనాల పార్కింగ్ పనులు పర్యవేక్షించారు. మరోసారి మండలాల వారిగా నాయకులు, కార్యకర్తలతో జనసమీకరణ గురించి సమీక్షించారు.
సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే వొడితల





