సభ్యత్వ నమోదు లో పిఆర్ టియుసంఘం ముందజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: గజ్వేల్ మండలంలో  పిఆర్టియు 2023 వ సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఊడెం వేమారెడ్డి, తిగుల్ల లింగం గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఊడెం వేమారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టియు సంఘం ముందంజలో ఉంటుందని, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతితో కూడిన పిఆర్సిని రాబోయే రోజుల్లో సంఘం సాధిస్తుందని అదేవిధంగా హెల్త్ కార్డులు  ఇప్పించడంలో సంఘం  ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలియజేశారు. ఉన్నత ప్రాథమిక పాఠశాల బూర్గుపల్లి , యు.పి.యస్. ధర్మారెడ్డి పల్లి, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, రిమ్మన గూడ, శ్రీగిరిపల్లి, అక్కరం, జాలిగామ,పిడిచెడ్ బెజుగాం,అహ్మాదిపూర్‌ ,సింగాటం, కొల్గూర్‌ పాఠశాలలు నమోదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, హన్మంత రెడ్డి, ఉపాధ్యక్షులు కనకరాములు ,శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బి.పోచయ్య గౌడ్, శ్రీనివాస్ రావు,,భాస్కర్,సత్యనారాయణ రెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి వెంకటేష్ గౌడ్   సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, వేణు చంద్రశేఖర్, ప్రదీఫ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *