ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుంటూ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు బిజెపిలో చేరి ఆచారి కి మద్దతు తెలిపారు. ఒకే ఒక్క అవకాశం ఇస్తే కల్వకుర్తి నియోజకవర్గం లో కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజల కు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. మీ ప్రాంత బిడ్డగా కల్వకుర్తి అభివృద్ధి కోసం పదవిలో ఉన్నా లేకున్నా ఎన్నో ఉద్యమాలు చేశానని ఐదు సార్లు ఓడిపోయిన వెనుకడుగు వేయకుండా మీలో ఒకడిగా ఉంటూ మీ అభివృద్ధి కోసం మీ హక్కుల కోసం పాలక ప్రభుత్వాలతో పోరాటం చేశానన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు ప్రాణాలకు తెగించి 8 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అప్పటి ప్రభుత్వాన్ని కదిలించానన్నారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యునిగా ఉన్నప్పుడు బీద ప్రజల పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి రైల్వే లైన్ తీసుకొస్తానన్నారు. అదేవిధంగా ఆచారి కి మద్దతుగా బిజెపి జాతీయ రాష్ట్ర నేతలు కల్వకుర్తికి చేరుకొని ప్రచారం నిర్వహించారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆచారి కి కల్వకుర్తి ముస్లింల మద్దతు




