పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: మీయాపూర్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైల్ విస్తరణతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు చెబుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచనలకు అనుగుణంగా బుధవారం ఇస్నాపూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్ చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి లు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు విస్తరణ మూలంగా లక్షల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమీన్ పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, అఫ్జల్, రాజేష్, మెరాజ్ ఖాన్, ఆయా గ్రామాల సర్పంచులు ఉపేందర్, కృష్ణ యాదవ్, కుమార్, లక్ష్మణ్, గోపాల్, ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



