సబితా ఇంద్రారెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి కార్యకర్తలకు సూచించిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 17 : సబితా ఇంద్రారెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి సూచించారు.మంగళవారం కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ గ్రామంలో కార్యకర్తల సమావేశం గ్రామ అధ్యక్షులు కాసోజు శివప్రసాద్ చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సురసాని సురేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,సబితారెడ్డి చేసిన అభివృద్దిని నాయకులు,కార్యకర్తలు ప్రజలకు విడమరిచి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.హ్యాట్రిక్ ఎమెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించే భాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిర్ర సాయిలు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,మమ్మద్ ఆలీ,బర్కం వెంకటేష్,కాకి రవీందర్ ముదిరాజ్,హనుమంత్ యాదవ్,దేశం కృష్ణారెడ్డి,సురసాని సుదర్శన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి,మీర్ఖాన్ పేట్  గ్రామ సర్పంచ్ బ్రాహ్మణపల్లి జ్యోతి చంద్రశేఖర్ గుప్తా,మీర్ ఖాన్ పేట్ ఎంపీటీసీ కాకి రాములు ముదిరాజ్,మాజీ ఎంపిటిసి ఇరగదిండ్ల సత్తయ్య,గండు నరసింహ, డేరంగుల వెంకటయ్య,నందిగామ చంద్రశేఖర్,కోరిమి నరసింహ ముదిరాజ్, కోడిచెర్ల రాఘవేందర్,చిర్ర వెంకటేష్,చిర్ర శ్రీనివాస్,చిర్ర మహేందర్,పంతం పాండుయాదవ్,జిల్లాల మహేందర్ యాదవ్,అండేకార్ కిషన్ జీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *