సబితా ఇంద్రారెడ్డిపై పారిజాత అసత్య ఆరోపణలు చేయడం సరికాదు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డికి సరికాదని బిఏంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి హితవు పలికారు. గురువారం బడంగ్ పేట్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామిడి రాం రెడ్డి బిఅర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ.. మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి తన ఇంటిపై ఐటి దాడులు చేస్తే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపించినట్లు మాట్లాడటం భావ్యం కాదన్నారు. గతంలో బిఅర్ఎస్ నేతలు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై ఐటి దాడులను కూడా సబితా ఇంద్రారెడ్డి చేపించరా..? అని  నిలదీశారు. ఆదాయ పన్ను శాఖ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందన్న ఇంకిత జ్ఞానం పారిజాత నర్సింహ రెడ్డికి లేనట్లు ఉందన్నారు. సబితా రెడ్డి తనకు టికెట్ రాకుండా అడ్డుకుంది, నాపై ఐటి దాడులు చేయించింది వంటి చౌకబార్ ఆరోపణలు మేయర్ చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రి భూ ఆక్రమణలకు పాల్పడి, వేల కోట్లు సంపాదించింది అనడం మంచిది కాదన్నారు. మేయర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రిపై చేసిన ఆరోపణలు నిరూపించాలని  సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస రాజు, పుట్టగల సంతోష్, బాలేష్ చారి. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *