సబితా ఇంద్రారెడ్డికి మహిళా నేతల అభినందనలు

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 5: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలువురు మహిళా నేతలు పూల బోకెలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి రెడ్డి మంగళవారం ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలో ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరై, పేరు పేరునా ప్రతి ఒక్కరిని పలకరించి ధన్యవాదాలు తెలిపారు. సబితా ఇంద్రారెడ్డిని ఆర్కేపురం డివిజన్ బిఅర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు లిక్కీ ఊర్మిళ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు శైలజ రెడ్డి, సునీత రెడ్డి, తదితరులు కలిసి పూల బోకేలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అహర్నిశలు శ్రమించి నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నాపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళ నాయకురాలతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *