కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గంలో పట్లోళ్ల సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులతో,కార్యకర్తలతో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేశ్వరం గడ్డపై సబితా రెడ్డి 2 పర్యాయాలు విజయం సాధించిందని ఆయన తెలియజేశారు.మరోమారు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కూడా గెలుపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆమె విజయాన్ని అడ్డుకోలేరని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కూడా బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్,బిఆర్ఎస్ నాయకులు ఇంజమూరి రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీలు కాకి రాములు,సురసాని రాజశేఖర్ రెడ్డి,ఐనవొలు మహేందర్ రెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదు





