మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, నవంబర్ 02: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తునాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గానికి గంగపుత్ర సంఘం నాయకులు మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి బి ఆర్ ఎస్ తోనే సాధ్యమని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్టానికి శ్రీ రామ రక్ష అన్నారు.అన్ని రంగాల్లో నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూన యాదయ్య, పోతార్ల అంబయ్య యాదవ్ ,మినాజ్ పటేల్ ,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ ,అల్లే శ్రీశైలం,అల్లే శివరాజ్,వార్డు సభ్యులు కూన ప్రవీణ్,వద్ది శ్రీనివాస్,అల్లే ఈశ్వర్,అల్లే ప్రభాకర్,గుర్రం బాలయ్య, కూన వెంకటేష్,వద్ది వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.





