సబితమ్మ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయి

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 1: మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బుధవారం కందుకూరు మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలలో బిఆర్ఎస్ అభ్యర్థి సబితా రెడ్డి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, సబితా రెడ్డి ప్రజల బాగు కోరే వ్యక్తి అని ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.సబితా రెడ్డి విజయం సాధిస్తుందని ప్రతిపక్షాలకు తెలిసిన ఆమెపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా సబితమ్మ విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయనపేర్కొన్నారు. .రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం లోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ప్రజలు భావిస్తున్నారని ఆయనపేర్కొన్నారు. రాష్ట్రంలో బారాస పార్టీ తప్ప ఇతర పార్టీలకు స్థానం లేదని ఆయన అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో మనోవేదనకు గురయ్యారని రైతులు సైతం విద్యుత్తు లేక అష్ట కష్టాలు పడ్డ సంఘటనలు కొకొల్లలని ఆయన తెలిపారు.నియోజకవర్గంలో బిజెపి పాత్ర శూన్యమని అన్నారు.ప్రభుత్వం చేసిన అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి వివరంగా తెలపడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో అన్నోజిగూడ సర్పంచ్ కాకి ఇందిరమ్మ దశరథ ముదిరాజ్, మీర్ఖాన్పేట్ ఎంపీటీసీ కాకి రాములు ముదిరాజ్,చిర్ర సాయిలు,దేశం కృష్ణారెడ్డి, పారిజాతం గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *