మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: నియోజకవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని అర్కేపురం బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లీక్కి ఊర్మిళ రెడ్డి కోరారు. గురువారం ఆర్కేపురం డివిజన్ లో ఊర్మిళ రెడ్డి పలువురు, బిఆర్ఎస్ మహిళా నాయకురాలు, కార్యకర్తలతో కలిసి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊర్మిళ రెడ్డి మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి, ఓటు వేయాలన్నారు. అర్కేపురం డివిజన్ టి పాటు మహేశ్వరం నియోజకవర్గాని అన్ని విధాలుగా ఏనలేని అభివృద్ది చేసినట్లు చెప్పారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి బిఅర్ఎస్ పార్టీకి మంచి స్పందన వస్తుదన్నారు. కొన్ని పార్టీల నాయకులు కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి పోతుంటారని, అలాంటి నేతలను నమ్మి ఓట్లు వేసి, మోసపోవద్దని హితవు పలికారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని ఆకాంక్షించే మంచి మనసున్న సబితమ్మకు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పటేల్ సునీత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సబితమ్మకు ఓటు వేయాలని ఆర్కేపురంలో బిఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం




