సన్నాసులు రాసిచ్చే ప్రసంగం చదువుతారా

  • కాంగ్రెస్‌ ‌రాష్ట్రాల్లో ప్రకటించిన పెన్షన్‌ అమలు చేయాలి
  • 80 వేల కోట్ల కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతా?
  • రాహుల్‌ ‌పప్పు అని మరోమారు తేల్చారు
  • ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో రాహుల్‌ ‌చెప్పిన పెన్షన్లు అందించి ఇక్కడ మాట్లాడాలని బిఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. అక్కడ చేయలేని వారు తెలంగాణలో చేస్తామమని చెబితే నమ్మడానికి ప్రజలు వెర్రిపప్పలుకాదన్నారు. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ.. రిమోట్‌ ‌గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి  అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్‌ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎం‌పీ వద్దిరాజు రవిచంద్ర కలిసి మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి వి•డియాతో మాట్లాడారు. ఖమ్మం సభలో రాహుల్‌ ‌వ్యాఖ్యలు చూస్తే ఆయన పప్పే అనేది నిజమని తేలిందన్నారు. వారు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయా అని నిలదీశారు.

ఛత్తీస్‌గఢ్‌లో వృద్దాప్య పెన్షన్‌ ‌రూ.500, రాజస్థాన్‌లో రూ.750 ఇస్తున్నారని అదే తెలంగాణలో వికలాంగులకు రూ.4వేలు ఇస్తున్నామని చెప్పారు. ముందుగా కాంగ్రెస్‌ ‌పాలిత ప్రాంతాల్లో రూ.4 వేలు పింఛన్‌ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ దేశంలో అవినీతికి అడ్రస్‌గా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే రూ.80 వేల కోట్లతో అని, దీనిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ‌హయాంలో జరిగినన్ని స్కాములు ఎక్కడా జరుగలేదని, వి•రు స్కాములకు రారాజులని విమర్శించారు. రాహుల్‌ ‌మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో మార్పుకోసం వొచ్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. తామెవరికీ ఏ టీమ్‌, ‌బీ టీమ్‌ ‌కాదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ‌పార్టీయే ఏ టీమ్‌, ‌బీ టీమ్‌గా మారుతున్నారని విమర్శించారు. ఈటల, రేవంత్‌రెడ్డి రహస్య భేటీ నిజం కాదా అని నిలదీశారు. ఎవరు, ఎవరికి బీ టీమో ఇప్పుడు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పేద ప్రజల అవసరాలు, కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు. కాంగ్రెస్‌ ‌నాయకులు అవకాశవాదులని మంత్రి పువ్వాడ అజయ్‌ ‌విమర్శించారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెంటే ఉన్నారని చెప్పారు. వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 100 ‌స్థానాలు గెలుచుకుంటుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్‌లో చేరినవారంతా ప్రజలు తిరస్కరించినవాళ్లేనని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ  మెచ్యూరిటీ లేని లీడర్‌ అని మంత్రి పువ్వాడ అజయ్‌ ‌విమర్శలు గుప్పించారు. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్‌ అని అన్నారు. కాంగ్రెస్‌ను నట్టేట ముంచి పక్కకు జరిగిన నేత నిన్న ఖమ్మం వొచ్చి మాట్లాడారన్నారు.

తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌కనీస పోటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్కడ బీజేపీతో మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌జరగలేదా అని నిలదీశారు. కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్ల వి•ద ఐటీ, ఈడీ రైడ్లు ఎందుకు జరగడం లేదన్నారు. తమ ఇళ్ల వి•దనే ఐటీ రైడ్‌ ఎం‌దుకు జరుగుతుందని నిలదీశారు. బాబ్రీ మజీద్‌ను కూల్చింది కాంగ్రెస్‌ ‌హయాంలోనే..ఇవన్నీ తమ మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌కాదా అని అన్నారు. ‘వి•ది కాంగ్రెస్‌ ‌కాదు స్కాంగ్రేస్‌ ‌పార్టీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‌హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు అన్నింట్లో కుంభకోణమే అని ఆరోపించారు.

నిన్న కాంగ్రెస్‌లో చేరిన నేతల్లో ఎవరికీ పార్టీ అన్యాయం చేయలేదన్నారు. తెల్లం వెంకట్రావ్‌, ‌పిడమర్తి, కోరం కనకయ్య టికెట్‌ ఇచ్చినా గెలవలేదన్నారు. ఇంతుంది అంతుందన్న నేత ఎందుకు వారిని గెలిపించలేకపోయారని ప్రశ్నించారు. భట్టి పాదయాత్ర ముగింపు సభలో ఆయన్నే పక్కకు తోసేశారని మంత్రి పువ్వాడ అజయ్‌ ‌వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అం‌టేనే స్కామ్‌ల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు  ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరినవారంతా అవకాశవాదులేనని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *