తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ శుక్రవారం సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 27 , 29 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న అంగవైకల్యం గల దరఖాస్తుదారులు హాజరుకావాలని ఆయన తెలిపారు. అదే విధంగా ఈ నెల 27, 30 వ తేదీల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించే క్యాంపులకు హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. ఇట్టి క్యాంపులకు గతంలో సదరం సర్టిఫికెట్ పొంది సర్టిఫికేట్ కాల పరిమితి దాటిన వారితో పాటు కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు.
సదరమ్ క్యాంపుకై మీసేవ కేంద్రాలు స్లాట్ బుక్ చేసుకోవాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి





