చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టో బర్ 20: తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీకైన తొమ్మిది రోజులు జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు మాచాపూర్, మెట్టుపల్లి, సలంద్రి, కమ్మర్లపల్లి, అల్లిపూర్ గ్రామాల్లో అందుకు భిన్నంగా ఏడు రోజులలో జరిగింది.మహిళలు, యువతులు ఉదయాన్నే తంగేడు, గునుగు వివిధ రకాల పువ్వులను తెచ్చి బతుకమ్మను పేర్చారు. ఆడపడుచులు చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి రామ రామ ఉయ్యాలో …రామనే శ్రీ రామ ఉయ్యాలో అంటూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లతో ఆడి పాడారు. బతుకమ్మల వద్ద మహిళలు, చిన్నారులు డిజే పాటలు, దాండియా ఆటలతో అలరించారు.అనంతరం గ్రామ శివారులో గల చెరువు కుంటలలో నీటిలో బతుకమ్మను వేస్తూ వెళ్లి రా బతుకమ్మ మల్లొచ్చేడుకు మళ్లీ రా బతుకమ్మ అంటూ నిమజ్జనం చేశారు. వారి వెంట తెచ్చుకున్న ప్రసాదములను ఒకరికి ఒకరు స్వీకరించారు.
సంబరంగ సద్దుల బతుకమ్మ



