సంపుటం!

రెండు మనసుల మధ్య
మమతల సమరం!
రెండు వయసుల మధ్య
సరసాల కథనం!
ఆధిపత్యపు పోరులో
తడి పొడి చప్పరింపులు!
అనురాగాల బదలాయింపులో
ఇచ్చిపుచ్చుకునే వాయినాలు!
వేళాపాళల హద్దులు లేని పయనం
వయసు సీమలు లేని ప్రణయం!
వలపుల పందేరంలో
తొలి, తుది పణాలు అక్కడే!
ముచ్చట్లు, ఇక్కట్లు అక్కడే!
రసిక యుద్ధంలో
సప్తమరుచి అనుపానమక్కడే!
విజేతలెవరో చెప్పని ఫలితమక్కడే!
ఉషారం
9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *