పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం
సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం మన్సాన్‌పల్లి శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





