జగదేవపూర్,ప్రజాతంత్ర, నవంబర్ 1: సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి ని చేస్తాయని రాష్ట్ర కార్యదర్శి ఎలివేటి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన శ్రీ కొండచమ్మ ఆలయం వద్ద టిఆర్ఎస్ ప్రచార రథం వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి తిగుల్ నర్సాపూర్, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం సాగించడం జరిగిందని అన్నారు. సంక్షేమ అభివృద్ధి పలాలే సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేస్తాయని అన్నారు. 60, 70 సంవత్సరాలలో బిజెపి కాంగ్రెస్ పార్టీలు చేయలేని అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పది సంవత్సరాల్లోనే ప్రజలకు సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలు మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, జెడ్పిటిసి వంటేరు సుధాకర్ రెడ్డి,ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్గుండా రంగారెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, కొండపోచమ్మఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎంపిటిసిల పోరం అధ్యక్షులు కిరణ్ గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాచర్ల నరేష్,మండల రైతు సమన్వయ సమితి సభ్యులు బట్టు సుధాకర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఇక్బాల్, నాచారం టెంపుల్ డైరెక్టర్ బుద్ధ నాగరాజు, మండల ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్, మండలం ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు కావ్య దర్గయ్య, సర్పంచులు రావికంటి చంద్రశేఖర్ గుప్తా, అంకిల యాదవ రెడ్డి, రజిత రమేష్, సత్యం,కుమార్, ఎంపీటీసీలు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి




