సంక్షేమ పథకాల చెల్లింపులు ఆపాలని కేసీఆర్‌ ‌కుట్ర

నవంబర్‌ 2‌లోపు  పూర్తి చేయాలి • రిటైర్‌ అధికారులతో కేసీఆర్‌ ‌ప్రయివేట్‌ ఆర్మీ
•నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి.
•పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం
•బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం అం‌తా చెడ్డీ గ్యాంగ్‌
•2/3 ‌మెజార్టీతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుంది.
•టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ బంధు, గృహలక్ష్మి, రైతు బంధు వంటి సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్‌ 2 ‌లోగా విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న నిర్దిష్టమైన డిమాండ్‌ అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ కేసీఆర్‌ ‌చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చెల్లిస్తుందని హమీ ఇచ్చారు. ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేల రైతు బంధు వస్తుంది.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్‌ ‌రూ.2 వేలు వస్తే తాము వచ్చాక రూ.4 వేలు ఇస్తామని చెప్పారు. గురువారం ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డిలతో కలిసి రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీని పూర్తి చేయాలని ఈసీకి చెప్పామని… కానీ, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఫిర్యాదు చేసినట్లు బీఆర్‌ఎస్‌ ‌తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు.కాంగ్రెస్‌ ‌పార్టీని బూచిగా చూపి కేసీఆర్‌ ‌చెల్లింపులు ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఆపాలని తాము చెప్పడం లేదని నవంబర్‌ 2 ‌వ తేదీ లోపే వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు జరగాలని కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్నదన్నారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్‌ ‌ను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్‌ ‌మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని రేవంత్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. రిటైర్డ్ అయిన వారిని పదవుల్లోకి తీసుకొచ్చి విపక్షాలపై దాడులు చేసేందుకు ఉప యోగిస్తున్నారని, అలాంటి వారిని పదవుల నుంచి తొలగించాలని ఈసీని కోరామని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌కు మద్దతిస్తున్న అధికారులకు ఎన్నికల విధులు అప్పగించవద్దని కోరామన్నారు. నిస్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశామన్నారు. విశ్రాంత అధికారులకు పదవులు ఇచ్చి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రైవేటు ఆర్మీలా వాడుకుంటున్నారని విమర్శించారు. నిజాం దగ్గర రజాకార్ల లాగా.. కేసీఆర్‌ ‌వద్ద ఈ అధికారులు రజాకార్ల లా పనిచేస్తున్నారని అన్నారు. అటువంటి విశ్రాంత అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరామన్నారు. అంజనీ కుమార్‌ ‌ను, స్టీఫెన్‌ ‌రవీంద్రను బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. కీలకమైన శాఖలను కొందరు ఐఏఎస్‌లు 7 – 8 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. జయేశ్‌ ‌రంజన్‌, అర్వింద్‌ ‌కుమార్‌, ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ‌కు ఎన్నికల నిధులు ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు అని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు.

మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన అంశంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎం‌దుకు భూమిలోకి కుంగింది? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్ట్ ‌వద్ద బొగ్గు నిక్షేపాలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ ‌నిర్మాణంలో నాణ్యత లోపం ఉందన్నారు. సాయిల్‌ ‌టెస్ట్ ‌వంటి జాగ్రత్తలు పాటించలేదన్నారు. గాల్లో మేడలా మేడిగడ్డ ప్రాజెక్ట్ ‌ను నిర్మించారని ఆరోపించారు. మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తులు చేశారని ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. ఈఎన్సీ మురళీధర్‌ ‌రావు 12 ఏళ్ల క్రితం రిటైర్‌ అయ్యారని, కేసీఆర్‌ ‌కి, మురళీధర్‌ ‌రావుకి ఉన్న సంబంధమేంటని నిలదీశారు. దోచుకునేందుకు ఇలాంటి అధికారులను పెట్టుకున్నారని విమర్శించారు. ఇంత ప్రమాదం జరిగితే ఎల్‌ఆం‌డ్‌ ‌టీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారిని ఎందుకు బ్లాక్‌ ‌లిస్ట్ ‌లో పెట్టడం లేదని ప్రశ్నించారు.ఇసుక కొట్టుకు పోతే డ్యాం కుంగింది అంటే, ఎంత నాణ్యత లోపం ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. క్రిమినల్‌ ‌కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్‌ ‌సేఫ్టీ అధికారులు మేడిగడ్డను పరిశీలించిన తర్వాత ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రానికి.. బీఆర్‌ఎస్‌ ‌కు ఉన్న లాలూచీ ఏంటి..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రానికి ప్రొటెక్షన్‌ ‌మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదు అని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్‌ ‌ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ‌బిల్లా రంగా లాంటివారని.. కేసీఆర్‌ ‌చార్లెస్‌ ‌శోభారాజ్‌ ‌లాంటి వారని ఎద్దేవా చేశారు. వాళ్లేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్‌ ‌పై ఎదురు దాడికి దిగుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఈడీ, ఐటీ, సీబీఐ బీజేపీకి ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లని ఆరోపించారు రేవంత్‌ ‌రెడ్డి.

కేసీఆర్‌ ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌ను అభివృద్ధి చేస్తే కొడంగల్‌ ‌లో పోటీకి రావాలన్నారు రేవంత్‌ ‌రెడ్డి. కొడంగల్‌ ‌లో పోటీ చేయాలని కేసీఆర్‌ ‌ను ఆహ్వానించానని… కొడంగల్‌ ‌లో పోటీకి కెసిఆర్‌ ‌రాకపోతే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే తానైనా, భట్టీ విక్రమార్క అయినా.. కామారెడ్డిలో కెసిఆర్‌ ‌పై, సిరిల్లలో కేటీఆర్‌ ‌పై పోటీకి సిద్ధమని తెలిపారు. కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌లను చిత్తుగా ఓడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్‌ ‌కు అవకాశం ఇవ్వలేదని… తెలంగాణలోనూ హంగ్‌ ఎప్పుడూ రాలేదని.. 2/3 మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు చెడ్డీ గ్యాంగ్‌ ‌లాంటిదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్‌ ‌కలిసి పోటీ చేస్తాయి. వారి మధ్య సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి అన్నారు. డిసెంబర్‌ 9‌న తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల అధికారులకు పిర్యాదు చేయడం ప్రాసెస్‌ అన్నారు రేవంత్‌ ‌రెడ్డి. అధికారులు తీసుకునే చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. కేసీఆర్‌, ‌హరీష్‌, ‌కేటీఆర్‌ ‌లు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పరని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉంది . అందుకే అక్కడ ఎటువంటి దాడులు ఉండవన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఈడీ, సీబీ లు ముందు వెళ్తాయన్నారు. కాంగ్రెస్‌ ‌ను వీడిన నాయకులు బీజేపీ సిద్దాంతాలు నమ్మి పోలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేసీఆర్‌ ‌పై చర్యలు తీసుకుంటుంది అని నమ్మి బీజేపీలోకి వెళ్లరన్నారు. అది అక్కడ సాధ్యం కాదని నమ్మి వెనక్కి వస్తున్నారని తెలిపారు. రాజ్‌ ‌గోపాల్‌ ‌రెడ్డి, డి.కె అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్‌ ‌రెడ్డిలు సిద్దాంతాలు నమ్మి బిజెపిలో చేరలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌లో చేరే వారికి పార్టీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.బీజేపీ.. జనసేనతో పాటూ కే.ఏ.పాల్‌ ‌ను కూడా కలుపుకుంటే బాగుండని వ్యంగాస్త్రం వేశారు రేవంత్‌ ‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *