శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 1: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, గంగారం గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెందిన నాయకులు .కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ వారికి బిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. యువత అంతా బిఆర్ఎస్ వైపు ఉందని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని అన్నారు. కార్యకర్తల పార్టీకి అండ అని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ గెలుపును కృషి చేయాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లిలో అత్యధిక మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు, బాబుమియ, లియాకత్ కాసిం నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్, అక్తర్, ఊరిటి వెంకట్రావు, మోహన్ ముదిరాజ్ పార్టీలో చేరిన వారిలో దొంతి శ్రావణ్ కుమార్, నాగేష్, సాయి, నరేష్, వెంకట్, బాబి, విష్ణు, నరేష్, నరసింహులు, సన్నీ , అలీ తదితరులు ఉన్నారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు





