శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర నవంబర్ 6: ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు సోమవారం శేరిలింగంపల్లి నియోజక వర్గం హాఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగౌతం గౌడు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని గంగారాం హుడా కాలనీ సుభాష్ నగర్ శాంతినగర్ కాలనీలకి చెందిన కాంగ్రెస్ బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ విప్ గాంధీ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన పలువురు కాంగ్రెస్ బిజెపిల చెందిన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. యువత అంతా టిఆర్ఎస్ వైపు చూస్తుందని, కార్యకర్తలేపార్టీకిపట్టుకొమ్మలని పట్టుకొమ్మలని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త టిఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపును కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొమ్మిది వేల కోట్ల రూపాయలతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను పలు రంగాల్లో అభివృద్ధి చేశానని, తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మళ్లీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు, టిఆర్ఎస్ పార్టీ చేరిన వారిలో జీవన్, దను, సంతోష్, శేఖర్, మల్లేష్, సాయికుమార్, కమల్, జాన్సన్, ఉమా సాయి, నవీన్, భాస్కర్, కిరణ్, సంతు, ప్రశాంత్, సురేష్, సునీల్, దుర్గారావు, నరేష్, హరిప్రసాద్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. ప్రభుత్వ విప్ గాంధీ





