సంక్షేమంలో  స్వర్ణయుగం బీఆర్ఎస్ సర్కార్ పాలన.

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:  రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం  కేసీఆర్‌ ప్రకటించి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అయిన సందర్భంగా శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ  మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో  పాలక వర్గం సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదములు, తీర్మానం ప్రవేశపెట్టి స్వీట్స్  పంచుకొని సంతోషం వెలిబుచ్చారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని కరోనా వంటి అనుకోని ఉపాదృవాలు వచ్చి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలవల్ల రుణమాఫీలో కొంత జాప్యం జరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు వంటి పథకాలను చిత్తశుద్ధితో నిరాటంకంగా కొనసాగిస్తూ సంక్షేమంలో స్వర్ణయుగం తపిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు.ఎన్ని కష్టాలొచ్చినా, ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విస్మరించలేదన్నారు. సెప్టెంబర్ మాసం చివరి వారం వరకు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అదేశించారని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ అన్ని హామీలు నెరవేరుస్తూ ప్రజాపరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి యావత్తు తెలంగాణ ప్రజలు సంతోషంగా గ్రామాల్లో సంబురాలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన సమస్యలు రాష్టానికి రావాల్సిన  నిధులను విడుదల చేయకుండా కేంద్రం  తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు  ఆర్థిక లోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని  వీటన్నింటినీ అధిగమించి రుణమాఫీపై ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది తో నిరాఘటంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే  ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధిపై కార్యాచరణను రూపొందించి చిత్తశుద్ధితో  రాష్ట్రప్రభుత్వం పని చేస్తోంది అన్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతూ రైతును రాజుగా చూడళ్లన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అన్నారు.ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉండగా  రోజు వారిగా రుణమాఫీ ప్రక్రియ చేపట్టిన విషయాన్ని వారు స్పష్టంచేశారు.  రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేనురోజుల్లో సెప్టెంబర్ రెండో వారం వరకు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ రైతు ప్రభుత్వంగా దేశంలో  రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందన్నారు. ఈ సమావేశంలో  ప్యాక్స్ చైర్మన్ జె వెంకటేష్ గౌడ్,మార్కెట్ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి. అగ్రికల్చర్ ఏ డీఏ బాబు నాయక్, సూపర్వైజర్ మహిపాల్, డైరెక్టర్లు బాల కిషన్, యాదగిరి, మతిన్, నర్సింలు, బొల్లారం ఎల్లయ్య,ప్రవీణ్,రూబెన్,  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *