షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 23: షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఫరూక్ నగర్ మండలం పీర్లగుడ, చౌలపల్లి, కిషన్ నగర్, భవాని గుట్ట తాండ గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు ప్రజలను తమ ఇళ్ళ వద్ద కలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లపై వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రోడ్డు షోలలో శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని, కాంగ్రెస్‌కు ఓటు వేసి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. 2014లో ప్రారంభమైన ప్రజల దీన స్థితి ఇప్పటికీ పదేళ్లలో అలానే ఉందన్నారు. ఆయా గ్రామాల ప్రజలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అండగా నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయా గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశవాదులు కేవలం అధికారం కోసం ప్రజల వద్దకు వస్తారని, ప్రజల కష్టాలు మాత్రం వారికి పట్టవని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల గ్రామాల ప్రజలు కష్టాలు, కన్నీళ్లను ఎవరూ మరిచిపోవద్దన్నారు. ప్రజల మంచి, చెడు పంచుకున్న సరైన వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ప్రజల బాధలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఒకసారి ఓడినా ప్రజల మధ్యనే ఉన్నానని, ఎక్కడికి పోలేదని అన్నారు. తన ఇల్లు నియోజకవర్గ కేంద్రంలోని ఉందని 24 గంటలు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులోని ఉన్నానని అన్నారు. తనకు హైదరాబాదులో బిల్డింగులు ఆస్తులు లేవని షాద్ నగర్ తన ఇల్లని ఇక్కడి ప్రజలే తన కుటుంబ సభ్యులు అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవడం కోసం వస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో షాద్ నగర్ ప్రజలు ఆలోచించి “చేతి గుర్తుపై” ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, జడ్పిటిసి వెంకట్రాం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, మైనార్టీ నేతలు ఇబ్రహీం, ఖాదర్ గోరి, మసూద్ ఖాన్ తో సహా ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గోన్నారు..
షాద్ నగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించండి సదా మీ సేవలో ఉంటాను




