షాద్ నగర్ అభివృద్ధిని చూసి అంతా ఆనందం పడుతున్నారు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28:  షాద్ నగర్ ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోటికే గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాయి అన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అంజన్న మనకు ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు 70 ఏళ్ల పాలనలో ఎవరు చేయలేకపోయారన్నారు. అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీలో చెందిన నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి అంజయ్య యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *