షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో.. ఇక మీ భూముల ధ‌ర‌లు పెరుగుతాయి

 షాద్ నగర్ సభలో సీఎం కేసీఆర్
 ఎమ్మెల్యే అభ్య‌ర్థి అంజ‌య్య యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా భారీ సభ
 అంజ‌య్య యాద‌వ్ వ‌జ్రం తున‌క, మంచోడు, చీమకు కూడా హాని చేయడు 
 షాద్‌న‌గ‌ర్,ప్రజా తంత్ర నవంబర్ 27: షాద్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక  షాద్ నగర్   బాలాజీ    వెంచర్ ఎదురుగా ఏర్పాటు చేసిన యాగశాల లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం జరిగింది ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ
 షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో తీసుకొచ్చే బాధ్య‌త నాది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి వ‌ర‌కు మెట్రో వ‌స్తే మీ భూముల ధ‌ర‌లు మూడింత‌లు పెరుగుతాయ‌ని కేసీఆర్ అన్నారు. షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్య‌ర్థి అంజ‌య్య యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.
అంజ‌య్య యాద‌వ్ వ‌జ్రం తున‌క లాంటి మ‌నిషి. ఆయ‌న చీమ‌కు దోమ‌కు కూడా అన్యాయం చేసే మ‌నిషి కాదు. ఇలాంటి ఎమ్మెల్యే చాలా త‌క్కువ ఉంట‌రు రాష్ట్రం మొత్తంలో. మొద‌ట్నుంచి నాతో పాటు న‌మ్మిన‌బంటుగా ఉన్నారు. ఇవాళ వ‌ర‌కు ఎలాంటి చెడ్డ ప‌ని చేయ‌లేదు. నా నియోజ‌క‌వ‌ర్గం నాకు కావాల‌ని కొట్లాడుతాడు  అంజ‌య్య లాంటి ఎమ్మెల్యే ఉంటే షాద్‌న‌గ‌ర్‌కు ఏదంటే అది వ‌స్త‌ది. మీరు సిటీ ప‌క్క‌కే ఉన్నారు. మేం మెట్రో రైలు గురించి ఆలోచ‌న చేస్తున్నాం. షాద్‌న‌గ‌ర్ దాకా మెట్రో రావాల‌ని అంజ‌య్య యాద‌వ్ ప‌ట్టుబ‌ట్టారు. ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో పెట్టించారు. షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో తీసుకొచ్చే బాధ్య‌త నాది. మీరు అంజ‌య్య‌ యాద‌వ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఒక మెడిక‌ల్ కాలేజీ రావాల‌ని కోరారు. నేను త‌ప్ప‌కుండా మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేస్తాను. పీజీ కాలేజీలు కొన్ని అడిగారు. మీకు చాలా విద్యాసంస్థ‌లు వ‌స్తాయి హైద‌రాబాద్ ప‌క్క‌కే ఉంట‌ది కాబ‌ట్టి. ఒక‌సారి మెట్రో వ‌స్తుంద‌ని తెలిస్తే మీ భూముల ధ‌ర‌లు మూడింత‌లు పెరుగుతాయి. అన్ని విద్యాసంస్థ‌లు వ‌స్తాయి. కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లు కూడా త‌ర‌లివ‌స్తాయి. దండం పెట్టుకుంట వ‌స్తాయి. షాద్‌న‌గ‌ర్‌కు మెట్రో వ‌స్తుంద‌ని తెలిసిన త‌ర్వాత దీనికి డిమాండ్ తారాజువ్వాలా లేచిపోయింది. హైద‌రాబాద్ సంక‌లో ఉన్నారు కాబ‌ట్టి.. అంజ‌య్య లాంటి ఎమ్మెల్యే ఉంటే ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డే ఎమ్మెల్యే ఉంటే మీ కోరిక‌ల‌న్నీ నెర‌వేరుతాయి అని, అలాగే
 గెలిచిన తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని,
ధరణి రైతులను బాగు చేస్తుంది తప్ప ఎలాంటి మోసం చేయలేదని ధరణి కారణంగా రైతులు బాగుపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అని వివరిస్తూ ధరణి ఉండాలా వద్దా.. అని పెద్ద ఎత్తున ప్రజలతో కావాలా వద్దని కేసీఆర్ వివరిస్తూ, భూములకు పట్టాలు అందజేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ చేసిన మోసాలు ఎన్నో ఉన్నాయని కౌలు రైతులకు ఇస్తామని ధరణి తీసేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలు నమ్మవద్దు  సీఎం కేసీఆర్ తెలియ చేసారు,
 టిఆర్ఎస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు, కెసిఆర్ అభిమానులు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున హాజరై సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *