షాద్‌నగర్ కు కాంగ్రెస్ కంచుకోట అని ఎప్పుడు నుంచో ప్రజలు అనుకుంటున్నా విషయమే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 20: కాంగ్రెస్ పూర్వ వైభవ పట్టు కోసం సమించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాకతో భారీ స్వాగతం తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత  ముందు షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. శత్రు పార్టీలకు దుర్భేద్యమైన కాంగ్రెస్ కంచుకోటకు పూర్వ వైభవం సంతరించుకునేలా సర్వశక్తులు ఒడ్డేందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టి సఫలీకృతం అయ్యింది. అయితే దీనికి పక్కా స్కెచ్ వేసి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తిరిగి కొనసాగించేందుకు ఏకంగా టిపిసిసి రేవంత్ రెడ్డి, మరో సీనియర్ నేత డాక్టర్ మల్లు రవి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ పెద్ద ఎత్తున పావులు కదిపారు. అనుకున్నట్టుగానే ప్రతాప్ రెడ్డి ఇంటికి చేరుకొని రేవంత్ రెడ్డి సదరు నాయకుల  మధ్య సయోధ్య కుదిరించారు. ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనుకున్నట్టుగానే శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు జెడ్పిటిసిలు వెంకటరామిరెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఇంకా పలువురు కీలక నాయకులు ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి ఆయా గ్రామాలకు సర్పంచ్ ఎంపీటీసీలు తదితర కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే చౌలలపల్లి ప్రతాప్ రెడ్డి మెడలో కండువా వేసి ఆయనకు ఘనంగా పార్టీలోకి స్వాగతం తెలిపారు. “ఘర్ వాపసి ఆగయే అంటూ రాహుల్ గాంధీ ప్రతాప్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం పట్ల పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.   షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి నేపథ్యం..షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన చౌలపల్లి ప్రతాపరెడ్డిరాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. జూలై 7న 1956న దూసకల్ గ్రామంలో వ్యవసాయ ఓ కుటుంబంలో జన్మించారు. బి.కాం వరకు విద్యనభ్యసించారు. 1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరారు.1995 స్థానిక సంస్థల ఎన్నికలలో షాద్‌నగర్ జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి జడ్పీటిసిగా ఎన్నికయ్యారు. 2002 నుండి 2004 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9,838 ఓట్ల మెజారిటీతో ఎమ్మేల్యేగా మొట్టమొదటిసారి ఎన్నికయ్యాడు. ప్రతాప్ రెడ్డి 2014, 2018 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. అయితే అక్కడ తలకు ప్రాధాన్యత దక్కలేదని పార్టీ టికెట్ ఆశించిన కనీసం అధిష్టానం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రతాపరెడ్డి ఆయన అనుచరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీన్ని పసిగట్టిన స్థానిక నేత వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీపీసీసీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్వయంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవచ్చారు. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీలో నేటికీ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు కొంతమంది ప్రతాప్ రెడ్డి కాళ్లపై పడి పార్టీలోకి రావాలని వేడుకోవడంతో ప్రతాప్ రెడ్డి చలించిపోయారని, సొంత పార్టీలో తనకున్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉండడంతో మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కంచుకోటకు సిద్ధమయ్యాడని కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ కంచుకోట చరిత్ర ఇదే.ఆనాటి మహబూబ్ నగర్ పూర్వ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. 2007 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో అప్పట్లో 4 మండలాలు మాత్రమే ఉండేవి. పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుడ్ నుంచి తిరిగి జనరల్‌కు మారింది. ప్రారంభంలో జనరల్ విభాగములో ఉన్న ఈ నియోజకవర్గము 1967లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎస్సీలకు కేటాయించబడింది. 1967 నుండి 2007 వరకు ఎస్సీలకు రిజర్వుడ్ నియోజకవర్గముగా ఉండేది. గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న బాలానగర్, నవాబుపేట మండలంలోని గ్రామాలు పునర్వ్యవస్థీకరణ ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలో కలిశాయి. మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ పి.శంకరరావు ఇక్కడి నుంచి 4 సార్లు విజయం సాధించారు. 1952లో తొలి ఎన్నికలలో విజయం సాధించిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. నియోజక వర్గంలోని ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏదైనా నియోజకవర్గం ఉంది అంటే అది ఈ ఉమ్మడి జిల్లాలోని షాద్ నగర్ కే ఈ ఘనత దక్కుతుంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరుగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా ఇందులో ఓసారి ప్రతాప్ రెడ్డి గెలుపొందారు, 2 సార్లు తెలుగుదేశం పార్టీ, 2 సార్లు తెరాస విజయం సాధించింది. అందుకే షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని నేటికీ రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తారు. ప్రతాప్ రెడ్డి రాకతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవన్నీ సంతరిచుకొనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *