షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌, ప్రజా తంత్ర నవంబర్ 27:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు పరిపాలించడం చేతకాదని ఎన్నో విమర్శలు చేశారు.కానీ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారన్నారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశారు. షాద్‌నగర్‌లో తాగు నీటి సమస్యను సీఎం కేసీఆర్‌ పరిష్కరించారన్నారు. అలాగే షాద్‌నగర్‌లో పీజీ కాలేజీ ఏర్పాటు చేయాలి. టామాట రైతుల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *