లేకుంటే ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదుద రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) కి అప్పగించేది లేదని సోమవారం రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి ప్రభుత్వం కృష్ణా బేసిన్ అవసరాలకు తగిన ప్రధాన్యం ఇవ్వలేదని, 299 టిఎంసిలకు అంగీకరించడం తీవ్ర తప్పిదమని తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కెఆర్‌ఎంబి పరిధిని పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం కనీసం అభ్యంతరం చెప్పలేదని ఆఫోపించింది. రాష్ట్ర చారిత్రక అన్యాయం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో షరతులకు అంగీకరించకబోతే ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించబోమని తీర్మానంలో స్పష్టంగా పేర్కొంది.




