శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తిక మాసం చివరి సోమవారం సందర్బంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం దేవాలయ కమిటీ సభ్యులు,ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా  నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసంలో పూజలు నిర్వహించి ఆది దంపతులైనటువంటి 20 మంది జంటలతో శివ పార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగిందని అన్నారు.అదేవిధంగా యావత్తు దేశ ప్రజలు బాగుండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సముద్రాల హరినాథ్,కుకుటపు కొండలు,ధనలక్ష్మి శేఖర్,అయిత రాములు, అయిత కృష్ణమూర్తి,పోతుగంటి శ్రీనివాస్,గుబ్బ శ్రీనివాసరావు,సముద్రాల రంగయ్య, సానిక కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *