శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సత్యనారాయణ సేవలు భేష్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్స్ అధినేత సత్యనారాయణ సేవలు బేష్ అని ప్రభుత్వ విప్  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన  వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర ల  కుమారుడు సుమంత్  అనే పేద విద్యార్థికి  ఉన్నత  చదువులకోసం 25 వేల రూపాయలు మరియు మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం ఏ నగర్ కి చెందిన గంగభావని అనే పేద విద్యార్థికి ఉన్నత చదువుల కోసం ఇరవై ఐదు వేలు మొత్తం 50వేలరూపాయలను మియాపూర్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్స్ అధినేత సత్యనారాయణ మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో  ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ  చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ   మాట్లాడుతూ  శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత  సత్యనారాయణ  మానవతా దృక్పథంతో పేద విద్యార్థుల చదువు కోసం తన వంతు సహాయంగా ముందుకు రావడం చాలా అభినందనీయం అని , సుమంత్ ఇంజనీరింగ్, గంగాభవాని ఉన్నత చదువుల కోసం    కాలేజీ ఫీజు ల నిమ్మితం ఈ విద్య సంవత్సరంకు ఆర్థిక సహాయం అందజేయడం అభి నందించ తగ్గ  విషయం అని తెలిపారు.సమాజ హితం తన వంతు కృషి చేసిన సత్యనారాయణను   సత్కరించి  ప్రత్యేకంగా అభినదించారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఆయన  సేవా నిరతిని కొనియాడారు.  ఆర్థిక స్థోమత లేక పేదవారు కావడం వలన కాలేజీ ఫీజు కట్టుకోలేని స్థోమత లేకపోవడం  చదువలకు ఆటంకం కల్గకుండా ,విద్యార్థుల  భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఇద్దరి భవిష్యత్  కు ఆటంకం కల్గకుండా ,  ఉన్నత  చదువులకోసం స్వంత డబ్బులతో  కాలేజీ ఫీజు కట్టడం జరిగినది అని,  చక్కగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ,మరియు ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మంచి భవిష్యత్తు ను ఏర్పరచుకొని స్థిరపడాలని గాంధీ   విద్యార్థులను ఆశీర్వదించారు .ఎప్పుడు ఏ సహాయం కావల్సిన తన వంతు కృషి  చేస్తానని విద్యార్థులకు చెప్పడం జరిగినది . విద్యార్థులు తమకు ఆర్థిక సహాయం అందజేసిన సత్యనారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ మరియు  తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *