తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ కర్ణాటక రాష్ట్రం గానుగ పూర్ లొని ప్రముఖ పుణ్యక్షేత్రంలొ వేలసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. గురువారం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయుని సన్నిధిలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాం లొ పాల్గొన్నారు అనంతరం ఈ సందర్భగా ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి నీ పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనను శాలువ పూలమాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన పూజారులు భరత్ పూజారి, కిరణ్ పూజారి, శరత్ పూజారి, తదితరులు ఉన్నారు.


