జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య హై స్కూల్ లో ప్రిన్సిపాల్ కి నరసింహ్మరెడ్డి కరస్పాండెంట్ కే లలిత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర జ్ఞాపకాలు మర్చిపోయి నూతన సంవత్సరoలో విద్యార్థిని విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులలో క్రీడా పోటీలు పెట్టి విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని నింపుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపాలని, చదువుతోపాటుగా క్రీడల్లో మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య హై స్కూల్ లో అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్





