జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెయింట్ పీటర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ కే నరసింహారెడ్డి, కరస్పాండెంట్ కె లలిత శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా పాఠశాలల్లో కృష్ణుని వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శిస్తున్నటువంటి ముకుందా రాదే రాదే రాధాకృష్ణ ముత్యాల ప్రత్యేకంగా వెన్నదొంగ కృష్ణ వచ్చాడే మా వైపు చిన్నారుల వేషధారణలు ఆకట్టుకోవడమే కాకుండా విద్యార్థులు అలరించినటువంటి శ్రీకృష్ణుని లీలామృతం సాంప్రదాయ శ్రీకృష్ణ వేషాదరాలను విద్యార్థులు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




